Kuwait Fire Accident: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Kuwait Fire Accident: మృతుల్లో భారతీయులు ఉన్నట్లు సమాచారం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 13 Jun 2024 11:33 AM IST
Massive Fire Accident in Kuwait
X

Kuwait Fire Accident: కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదం

Kuwait Fire Accident: కువైట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 50 మంది మరణించారు. మరో 50 మందికిపైగా తీవ్ర గాయాలపాలైనట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. కేరళ, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారని సమాచారం. దక్షిణ మంగాఫ్‌ జిల్లాలోని ఓ ఆరు అంతస్తుల భవనంలో ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కువైట్‌ అగ్ని ప్రమాద ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే కువైట్‌లోని భారతీయ రాయబారి ఘటనా స్థలాన్ని సందర్శించారని.. బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story