China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి

China Earthquake: భయాందోళనతో పరుగులు తీసిన ప్రజలు.. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు

Jyothi
Published on: 19 Dec 2023 7:49 AM IST
Massive Earthquake Strikes China, 111 Killed, 200 people injured
X

China Earthquake: చైనాలో భారీ భూకంపం.. 111 మంది మృతి

China Earthquake: చైనాలో భారీ భూకంపం సంభవించింది. వాయువ్య చైనాలోని గన్స్‌, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. భూకంపం తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 95 మంది మృతి చెందారు. 200 మందికి పైగానే గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అక్కడి కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. భూకంపం ధాటికి పలు భవనాలు నేలకూలాయి. ప్రజలు భయాందోళనతో రోడ్లవెంట పరుగులు తీశారు. రెస్క్యూ బృందాలు రంగంలోకి సహాయక చర్యలు చేపట్టాయి. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్థానిక సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Jyothi

Jyothi

Next Story