Senegal: పార్లమెంట్‌లో తన్నుకున్న ఎంపీలు..

Senegal: చట్టాలు రూపొందించాల్సిన అగ్రనేతలే ఆగ్రహంతో కొట్టుకున్నారు.

Arun Chilukuri
Published on: 5 Dec 2022 3:17 PM IST
Massive Brawl in Senegal Parliament
X

Senegal: పార్లమెంట్‌లో తన్నుకున్న ఎంపీలు..

Senegal: చట్టాలు రూపొందించాల్సిన అగ్రనేతలే ఆగ్రహంతో కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. సెనెగల్‌ పార్లమెంట్‌ సాక్షిగా ఎంపీలు తన్నుకున్నారు. సెనెగల్‌ విపక్ష నేత మస్సాట్‌ సంబ్‌ సహచర సభ్యురాలు యామి నదియా గింబేను ముందుగా చెంపదెబ్బ కొట్టారు. దీంతో పార్లమెంట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత ఏర్పడింది.. గింబే అక్కడే ఉన్న కుర్చీ తీసుకొని సంబ్‌ మీదికి విసిరారు. తోటి సభ్యులు వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. ఇరువర్గాల ఘర్షణతో పార్లమెంట్‌ సెషన్‌ను సస్పెండ్‌ చేశారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు సాల్‌కు మూడోసారి పదవిని కట్టబెట్టడానికి జరిగిన చర్చ గొడవకు దారి తీసింది. ఎంపీలు తన్నుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story