USA: అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి

USA: లెవిస్టన్, మైన్ ప్రాంతాల్లో జన సమూహంపై కాల్పులు

Jyothi
Updated on: 26 Oct 2023 9:27 AM IST
Mass Shooting At Lewiston In America 22 People Passes Away
X

USA: అమెరికాలో కాల్పుల కలకలం.. 22 మంది మృతి

USA: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం సృష్టిస్తున్నాయి. బుధవారం రాత్రి లెవిస్టన్, మైన్ ప్రాంతాలలో ఓ దండగుడు జన సమూహంపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 22 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో 60 మంది గాయపడడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన వెంటనే దుండగుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన పోర్ట్‌లాండ్ కు 56 కిలో మీటర్ల దూరంలో జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పోర్ట్‌లాండ్‌లో అతి పెద్ద నగరం లెవిస్టన్, రెండో నగరం మైన్ అని అధికారులు వెల్లడించారు.

Jyothi

Jyothi

Next Story