ఛీ ఛీ ఇదేం కక్కుర్తి : ఏటీఎంకి వెళ్లి శానిటైజర్ దొంగతనం చేశాడు

ఛీ ఛీ ఇదేం కక్కుర్తి : ఏటీఎంకి వెళ్లి శానిటైజర్ దొంగతనం చేశాడు
x
Highlights

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి వణికిస్తోంది. అయితే దీన్ని అరికట్టేందుకు వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచానికి వణికిస్తోంది. అయితే దీన్ని అరికట్టేందుకు వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో భాగంగా సామాజిక దూరంతో పాటు మొఖానికి మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించాలని లేదా సబ్బుతో చేతులను కడుక్కోవాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాస్కులకి, శానిటైజర్లుకి మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగింది. అయినప్పటికీ కొందరు ప్రజలు దీనిని కొంటున్నప్పటికి మరికొందరు మాత్రం ఇంట్లోనే శానిటైజర్లను తయారు చేసుకుంటున్నారు.

ఇక ఇదిలా ఉంటే తాజాగా పాకిస్థాన్లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. వినియోగదారుల శుభ్రత కోసం ఏటీఎంలో శానిటైజర్ బాటిళ్లను ఏర్పాటు చేశారు బ్యాంకు అధికారులు.. అయితే డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి కన్ను శానిటైజర్ బాటిల్ పై పడింది. ఆలోచన వచ్చిందే పనిగా దానిని దొంగిలించాడు. పాకిస్తాన్ లోని పెషావర్ లో నమక్ మండీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఏటీఎంలో డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వచ్చిన యువకుడు ముందుగా శానిటైజర్ బాటిల్ తీసుకొని చేతులను శుభ్రం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ బాటిల్ నీ పక్కన పెట్టి డబ్బులు విత్ డ్రా చేసుకున్నాడు.

అనంతరం అతనికి ఏమనిపించిందో ఏమో కానీ శానిటైజర్ బాటిల్ ను తన చొక్కాలో పెట్టుకొని వెళ్ళిపోయాడు.. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయింది. అయితే దీనికి సంబంధించిన వీడియోని పాకిస్తాన్ కి చెందిన ఓ జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనితో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ఇప్పటివరకు ఏటీఎంలో డబ్బులు దొంగతనం చేసిన వారిని చూశాము కానీ శానిటైజర్‌ బాటిల్‌ను దొంగతనం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి దొంగతనం నెంబర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని కామెంట్లు పెడుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories