USA: నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జ్‌..నదిలో పడిన కార్లు..!

USA: బ్రిడ్జిపై ప్రయాణిస్తోన్న వాహనాలు నదిలో గల్లంతు

Shashank Gullapelli
Published on: 26 March 2024 4:04 PM IST
Major Bridge In Us City Of Baltimore Collapses
X

USA: నౌక ఢీకొనడంతో కుప్పకూలిన బ్రిడ్జ్‌..నదిలో పడిన కార్లు..!

USA: అమెరికాలో ఎవరూ ఊహించని ఒక ఘటన జరిగింది. షిప్ ఢీకొనడంతో ఏకంగా ఒక బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. మేరీలాండ్‌లో ఓ కంటైనర్ షిప్ బల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్‌కీ అనే బ్రిడ్జిని ఢీకొట్టడంతో అది ఒక్కసారిగా కూలిపోయింది. ఇక బ్రిడ్జిపై ప్రయాణిస్తోన్న వాహనాలు నీటిలో పడిపోయినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే షిప్‌లో మంటలు చెలరేగాయి. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత భారీస్థాయి కంటైనర్ షిప్ ఈ బ్రిడ్జిని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా అది పేకమేడలా కూలిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ప్రమాద సమయంలో బ్రిడ్జిపై నుంచి ప్రయాణిస్తోన్న వాహనాలు నదిలో పడిపోయినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story