logo
ప్రపంచం

Pakistan Army Chief: పాక్‌ కొత్త ఆర్మీ చీఫ్‌గా అసిమ్‌ మునీర్‌..

Lt Gen Asim Munir Appointed as New Pakistan Army Chief
X

Pakistan Army Chief: పాక్‌ కొత్త ఆర్మీ చీఫ్‌గా అసిమ్‌ మునీర్‌..

Highlights

Pakistan Army Chief: అనేక తర్జన భర్జనల అనంతరం పాకిస్థాన్‌ ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్‌ను ఎంపిక చేసుకుంది.

Pakistan Army Chief: అనేక తర్జన భర్జనల అనంతరం పాకిస్థాన్‌ ప్రభుత్వం కొత్త ఆర్మీ చీఫ్‌ను ఎంపిక చేసుకుంది. పాకిస్థాన్‌ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ చీఫ్‌, లెప్టినెంట్‌ జనరల్‌ ఖాసిమ్‌ మునీర్‌ను ఆర్మీ చీఫ్‌ పదవి వరించింది. ఈనెల 29న ప్రస్తుత ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావేద్‌ బజ్వా రిటైర్‌ కానున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఆర్మీ కొత్త బాస్‌ ఎంపిక ప్రక్రియను పాకిస్థాన్‌ రక్షణ శాఖ చేపట్టింది. ఈ క్రమంలో పలువురి పేర్లను రక్షణ శాఖ పరిశీలించింది. ఫైనల్‌గా మునీర్‌ను ఎంపిక చేసింది. పాకిస్థాన్‌లో ప్రధాని, అధ్యక్షుడి కంటే ఆర్మీ చీఫ్‌ పదవే అత్యంత కీలకం. స్థానిక, విదేశీ కార్యకలాపాల్లో ఆర్మీ ప్రధాన పాత్ర పోషిస్తోంది. తాజాగా మునీర్‌ ఎంపిక ప్రభావం భారత్‌తో పాటు పొరుగున ఉన్న అఫ్ఘానిస్థాన్‌పై పడనున్నది.

Web TitleLt Gen Asim Munir Appointed as New Pakistan Army Chief
Next Story