Large explosion in lebanon capital beirut: లెబనాన్ రాజధాని బీరూట్ లో భారీ పేలుళ్లు!

Large explosion in lebanon capital beirut: లెబనాన్ లో పేలుళ్లు

K V D Varma
Published on: 5 Aug 2020 12:50 AM IST
Lebanon explosions
X
lebanon explosions (twitter images)

లెబనాన్ లోని బీరూట్ లో భయానక పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో పది మందికి పైగా చనిపోయి ఉండవచ్చని తెలుస్తోంది. అయితే, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో కనిపిస్తున్న పేలుడు జరిగిన తీరు.. ఆ ధాటి చూస్తె మృతుల సంఖ్యా ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని పరిశీలకులు చెబుతున్నారు. అధికారికంగా ప్రకటన లెబనాన్ నుంచి వేలువదనప్పటికీ, ఇప్పటికే సోషల్ మీడియాలో పేలుడుకు సమబందించిన ఫోటోలు, వీడియోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి.

లెబ‌నాన్ రాజ‌ధాని బీరుట్‌లోని పోర్ట్ ఏరియాలో మంగళవారం (ఆగస్టు 4) సాయంత్రం ఈ పేలుళ్లు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడికి దగ్గరలోని పేలుడు పదార్థాలు నిల్వ చేసే గోదాముల్లో ప్రమాదం కారణంగా భారీ పేలుడు సంభవించిందని కొన్ని మీడియా కథానాల్లో పేర్కొన్నారు. అయితే, ఇంకా పేలుడుకు కారణాలు తెలియాల్సి ఉంది.




K V D Varma

K V D Varma

Next Story