Lambda Variant: కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్లు

Lambda Variant Detected in More Than 30 Countries
x
Representational Image
Highlights

Lambda Variant: డెల్టా విజృంభిస్తున్న తరుణంలో లామ్డా వేరియంట్‌ * 30 దేశాల్లో విస్తరించిన లామ్డా రకం వైరస్‌

Lambda Variant: కరోనా సెకండ్‌ వేవ్‌ నుంచి కోలుకుంటున్న ప్రపంచదేశాలకు కొత్త రకం వేరియంట్ల కలవరపెడుతున్నాయి. ఓ వైపు డెల్టా వేరియంట్ విజృంభిస్తుంటే మరో రకం వైరస్‌ను గుర్తించడం కలకలం రేపుతోంది. కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి ఇప్పుడు లామ్డా వేరియంట్‌గా రూపం మార్చింది. డెల్టా వేరియంట్ ప్రస్తుతం 100కిపైగా దేశాలకు విస్తరించగా మరోవైపు దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా, ఐరోపా దేశాల్లో లామ్డా వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తుంది.

ఈ నేపథ్యంలో లాంబ్డా వేరియంట్‌పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లామ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లామ్డాతో అత్యధిక మరణాలు సంభవించవచ్చని హెచ్చరించింది. మరోవైపు యూకేలో గుర్తించిన లామ్డా వేరియంట్ డెల్టా కంటే మూడు రెట్లు ప్రమాదకరమైందని అని పరిశోధకులు తేల్చారు. పెరూలో దాదాపు 82 శాతం ఈ కేసులుండగా చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లామ్డా వేరియంట్ ఉన్నట్లు గుర్తించారు.

ఇప్పటివరకూ భారత్‌లో ఈ కొత్త రకం వైరస్‌ సోకిన దాఖలాలు లేవు. భారత్‌తోపాటు, మన ఇరుగుపొరగు దేశాల్లోనూ ఇప్పటివరకూ ల్యామ్డా రూపాంతరితాన్ని గుర్తించలేదు. ఆసియా మొత్తమ్మీద ఒక్క ఇజ్రాయెల్‌లోనే దీన్ని గుర్తించారు. గత నెల 14న లామ్డాను వేరియంట్‌ ఆఫ్‌ ఇంటరెస్ట్‌గా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories