ఫుడ్ షార్టేజ్‌తో అల్లాడుతున్న నార్త్ కొరియా.. 2025 వరకు తక్కువ తినండి: కిమ్‌ జాంగ్‌ ఉన్‌

Kim Jong Un Asks People to ‘eat less’ till 2025 Amid Food Shortage
x

ఫుడ్ షార్టేజ్‌తో అల్లాడుతున్న నార్త్ కొరియా.. 2025 వరకు తక్కువ తినండి: కిమ్‌ జాంగ్‌ ఉన్‌

Highlights

North Korea: ఫుడ్ షార్టేజ్‌తో నార్త్ కొరియా అల్లాడిపోతోంది.

North Korea: ఫుడ్ షార్టేజ్‌తో నార్త్ కొరియా అల్లాడిపోతోంది. ఓ వైపు ఆకాశాన్నంటిన ధరలు మరోవైపు అంతర్జాతీయ ఆంక్షలతో నార్త్ కొరియా సతమతమవుతోంది. దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ అది ఏమాత్రం సరిపోవడం లేదు. దేశం ఆహార కొరతతో బాధపడుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దేశ రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను ప్రజల రక్షణకు, ఆహార ఉత్పత్తికి ఇవ్వలేదన్న విమర్శలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

మరోవైపు కొరియాలో ఆహార కొరత తీవ్రంగా ఉందని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం నివేదిక కూడా ఇచ్చింది. అయితే, ఈ నివేదికను అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆమోదించలేదు. తమ దేశంలో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఇదే సమయంలో దేశ ప్రజలకు కిమ్ కొన్ని సూచనలు చేశారు. 2025 వరకు అందరూ తక్కువ ఆహారం తీసుకోవాలని సూచించారు. చైనాతో సరిహద్దులు తెరుచుకోవడానికి మరో మూడేళ్ల సమయం పడుతుందని అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories