బరితెగించిన డ్రగ్స్ మాఫియా.. కాల్చి చంపిన సైన్యం..

Jordan Army Killed 27 Drug Smugglers from Syria
x

బరితెగించిన డ్రగ్స్ మాఫియా.. కాల్చి చంపిన సైన్యం.. 

Highlights

Jordan Drug Smugglers: జోర్డాన్ దేశంలో డ్రగ్స్ మాఫియా బరితెగించింది.

Jordan Drug Smugglers: జోర్డాన్ దేశంలో డ్రగ్స్ మాఫియా బరితెగించింది. దేశంలోకి డ్రగ్స్ స్మగ్లర్లు చొరబడుతున్నారన్న సమాచారంతో జోర్డాన్ సైన్యం అలెర్ట్ అయింది. మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 27 మందిని జోర్డాన్ సైన్యం కాల్చి చంపింది. సిరియా నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా..వారిని హతమార్చినట్లు జోర్డాన్ సైన్యం ప్రకటించింది.

అనేకసార్లు డ్రగ్స్ అక్రమ సరఫరా యత్నాలను అడ్డుకున్నామని తెలిపిన జోర్డాన్ సైన్యం పెద్ద ఎత్తున నార్కోటిక్స్​ను సీజ్ చేశామని తెలిపింది. సరిహద్దు నుంచి అక్రమంగా చొరబాట్లకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది. అయితే కొంతమంది అనుమానిత స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని వారిని జవాన్లు కాల్చి చంపారని సైన్యం తెలిపింది. ఈ నెల ప్రారంభంలోనూ సిరియా సరిహద్దులో స్మగ్లర్లకు, సైన్యానికి మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సీనియర్ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. జోర్డాన్​లో ఆరున్నర లక్షల మందికి పైగా సిరియా శరణార్థులు ఆశ్రయం పొందుతున్నారు. పదేళ్లుగా దేశంలో నెలకొన్న అంతర్యుద్ధాన్ని తట్టుకోలేక వీరంతా జోర్డాన్​కు తరలివచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories