జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత

Arun Chilukuri
Published on: 13 Oct 2020 9:20 PM IST
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ట్రయల్స్ నిలిపివేత
X

కరోనా వ్యాక్సిన్‌పై పోరు కొనసాగుతున్న వేళ మరో నిరాశజనక ప్రకటన వచ్చింది. మరో వ్యాక్సిన్‌‌ క్లినికల్‌ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిచిపోయాయ్. టీకాను తీసుకున్న ఓ వాలంటీర్‌లో అంతుచిక్కని అనారోగ్య సమస్య తలెత్తడంతో ప్రస్తుతానికి నిలిపివేశారు. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు చేరుకున్న వ్యాక్సిన్లలో అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా ఒకటి. ఇప్పటికే రెండు ఫేజుల్లో ఆశాజనక ఫలితాలు ఇచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. మూడో దశ కోసం ప్రపంచవ్యాప్తంగా 60వేల మంది వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగించనున్నట్లు కూడా ప్రకటించింది. దీనికి ఇప్పటికే నమోదు ప్రక్రియ ప్రారంభమైందని తెలిపింది. ఐతే ఈ టీకా తీసుకున్న ఓ వ్యక్తిలో ఇటీవల వివరించలేని అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు గుర్తించింది. భద్రతా ప్రమాణాల ప్రకారం ట్రయల్స్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story