కన్నీరు పెట్టుకున్న జో బైడెన్

Arun Chilukuri
Updated on: 19 Nov 2020 10:00 PM IST
కన్నీరు పెట్టుకున్న జో బైడెన్
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జో బైడెన్‌ కంటతడి పెట్టారు. ఆరోగ్య సిబ్బందితో జరిగిన ఓ అన్‌లైన్‌ సమావేశం సందర్భంగా ఆయన ఎమోషనల్ అయ్యారు. కరోనా విధుల్లో ఉన్న ఆ దేశ ఆరోగ్య సిబ్బంది తమ క్షేత్ర స్థాయి అనుభవాలను కాబోయే అధ్యక్షుడికి తెలియజేశారు. మిన్నెసోటాకు చెందిన మేరీ టర్నర్‌ అనే నర్స్‌ మరణానికి చేరువలో ఉన్న కొవిడ్‌ బాధితులతో తన అనుభవాలను వివరించారు. కరోనా బాధితులు తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయుల కోసం పరితపించే వారని వారి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ఓదార్చానని మేరీ చెప్పారు. అది విన్న బైడెన్‌ ఒకింత భావోద్వాగానికి గురై కన్నీరు కార్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story