Joe Biden Makes History: అమెరికా ఎన్నికల చరిత్రలో బైడెన్ రికార్డ్

Arun Chilukuri
Updated on: 5 Nov 2020 4:17 PM IST
Joe Biden Makes History: అమెరికా ఎన్నికల చరిత్రలో బైడెన్ రికార్డ్
X

Joe Biden Makes History : డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ అమెరికా ఓట్ల చరిత్రలో రికార్డ్ సృష్టించారు. ఇప్పటివరకూ ఏ అధ్యక్ష అభ్యర్థికి రానన్న ఓట్లు సంపాదించి చరిత్ర సృష్టించారు. 2008 ఎన్నికల్లో అదే పార్టీకి చెందిన ఒబామాకు అత్యధికంగా 6 కోట్ల 94 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఆ ఓట్లను బైడెన్ క్రాస్ చేశారు. బుధవారం మధ్యాహ్నానికి ఆరు లక్షల 99 వేల కోట్ల ఓట్లు సాధించటంతో బైడెన్ ఆ రికార్డును తిరగరాశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో చివరకు బైడెన్ పైచేయి సాధించారు. అధ్యక్ష పీఠానికి ఆరు ఓట్ల దూరంలో నిలిచారు. మొదటి నుంచి చాలా రాష్ట్రాల్లో ఎలక్టోరల్ ఓట్లు గెలుచుకున్న బైడెన్ ఇప్పటివరకు 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. మరో ఆరు ఓట్లు సాధిస్తే బైడెన్ అధ్యక్ష పదవి చేపట్టనున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story