Japan Airlines: టోక్యో ఎయిర్‌ పోర్టులో రెండు విమానాలు ఢీ..చెలరేగిన మంటలు

Japan Airlines: మంటలు అంటుకోగానే పరుగులు పెట్టిన ప్రయాణికులు

Shekhar G
Published on: 2 Jan 2024 4:00 PM IST
Japan Airlines Plane Catches Fire On Runway Of Tokyo Haneda Airport
X

Japan Airlines: టోక్యో ఎయిర్‌ పోర్టులో రెండు విమానాలు ఢీ..చెలరేగిన మంటలు

Japan Airlines: జపాన్‌ రాజధాని నగరం టోక్యోలో విమానం దగ్ధమైంది. హనేదా ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌ అవుతున్న సమయంలో విమానంలో మంటలు రేగాయి. ల్యాండ్ చేసే సమయంలో కోస్ట్ గార్డ్‌ ప్లేన్‌ను ఢీకొట్టడంతో విమాన రెక్కలకు మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత మంటలు విమానంలోకి పాకాయి.

మంటలు చెలరేగడంతో వెంటనే విమానాన్ని నిలిపేశారు. అందులోని ప్రయాణికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బంది, ప్రయాణికులు కలిపి మొత్తం 379 మంది ఉండగా.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన స్థలంలో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేసినా ఫ్లైట్ పూర్తిగా దగ్ధమైపోయింది.

Shekhar G

Shekhar G

Next Story