యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఆపై ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్ ఫైర్

Israel Iran Conflict Updates: ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య నడుస్తున్న యుద్ధం ఇక ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

Indira Ram
Published on: 24 Jun 2025 11:30 AM IST
Israel Iran war Ceasefire Trump Statement Telugu
X

యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఆపై ట్రంప్‌ ప్రకటనపై ఇరాన్ ఫైర్

Israel Iran Conflict Updates: ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య నడుస్తున్న యుద్ధం ఇక ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు చెప్పారు. అయితే, దీనికి సమాధానంగా ఇరాన్.. ‘అతెనవరు చెప్పడానికి మేము మాత్రం తగ్గేదేలె’.. అంటూ దాడులను కొనసాగిస్తూనే ఉంది. వివరాల్లోకి వెళ్లితే...

ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా తీవ్రంగా నలిగిపోతుంది. ఇప్పటివరకు ఇరాన్‌,ఇజ్రాయిల్ దేశాలు మాత్రమే ఆయాదేశాల్లో దాడులు చేసాయి. కానీ ఇక నుంచి రణరంగంలోకి పశ్చిమాసియా దేశాలు కూడా దిగే ప్రమాదం కనిపిస్తుంది. ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై అమెరికా చేసిన దాడులకు ప్రతీకారంగా ఇప్పటికే ఇరాన్ ఖతార్, సౌదీతో పాటు పలు అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా ఆస్తులను ధ్వంసం చేసింది. దీంతో ఇప్పుడు ఆ దేశాలు కూడా ఇరాన్‌పై సీరియస్‌గా ఉన్నాయి.

అమెరికాపై ప్రతీకారంతో ఇరాన్ ఆపరేషన్ బేషరత్ ఫతాహ్ పేరుతో దాడులు జరిపింది. ఖతార్‌‌లోని అమెరికాస్థావరంపై క్షిఫణులను ప్రయోగించింది. అదేవిధంగా ఇరాక్‌లోని అల్ ఉదైద్ అమెరికా బేస్‌పైనా దాడి చేసింది. ఈ దాడి జరిగే సమయానికి ఆ బేస్ 13వేలమంది వరకు అమెరికా సైనికులు ఉన్నట్లు అంచనా. అయితే ఇరాన్ దాడులు ప్రారంభించకముందే అక్కడను వాహనాలను, సైన్యాన్ని తరలించారని సమాచారం.

ఈ దాడులు తర్వాత అమెరికా సీజ్ ఫైర్ ప్రకటించింది. అంతకుముందు రెండు రోజుల క్రితం అప్పటివరకు ఇజ్రాయిల్‌కు సహకరించిన అమెరికా ఆ తర్వాతే ప్రత్యక్షంగా ఇరాన్‌లోని పలు అణ్వాయుధ, సైనిక స్థావరాలపై దాడులు జరిపింది. దీనికి ప్రతిదాడిగానే ఇరాన్ పలు దేశాల్లో ఉన్న అమెరికా కార్యాలయాలు, ఆఫీసులను ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇప్పుడు గల్ఫ్ దేశాలు భయంతో వణుకుతున్నాయి. అయితే ఖతార్, సౌదీ వంటి దేశాలు ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించాయి. దీనికి సరైన సమాధానం ఉంటుందంటూ హెచ్చరించాయి.

ఇదిలా ఉంటే మరోపక్క ఇక ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలమధ్య ఒప్పందం కుదిరిపోయిందని,ఇక కాల్పులను విరమిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే పశ్చిమాసియా నాశనమైపోతుందని, అందుకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఈ రెండు దేశాలు చేసుకున్నాయని వెల్లడించారు.

అయితే ఈ ప్రకటనపై ఇరాన్ మండిపడుతుంది. తగ్గేదేలే..అంటూ దాడులను కొనసాగిస్తోంది. అంతేకాదు, అమెరికా చెప్పినట్లు ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరలేదని చెప్పింది. ఇజ్రాయిల్ కాల్పులను విరమిస్తే తాము కూడా విరమిస్తామని ఆ దేశ విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఆ తర్వాత ఆయన మరొక ప్రకటన చేశారు.. చివరి నిమిషం వరకు పోరాడిన ఇరాన్ సైన్యానికి కృతజ్నతలు చెప్పారు. దీన్ని బట్టి ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ఇదే గనక నిజమైతే ఇకనుంచి పశ్చిమాసియా దేశలు ఊపిరి పీల్చుకుంటాయి. ఒకవేళ ఇది నిజం కాకపోతే ఇరాన్, ఇజ్రాయిల్‌ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇక నుంచి గల్ఫ్ దేశాలు కూడా చేరతాయి. ఇదేగనక జరిగితే ప్రపంచ దేశాలకు మరింత ప్రమాదం పొంచి ఉంటుంది.

Indira Ram

Indira Ram

Next Story