Israel-Hamas: చిన్నారుల ఆస్పత్రి కిందే హమాస్‌ సొరంగం..!

Israel Alleges Hamas Built a Tunnel Under a Gaza Hospital
x

Israel-Hamas: చిన్నారుల ఆస్పత్రి కిందే హమాస్‌ సొరంగం..!

Highlights

Israel-Hamas: భారీ టన్నల్‌ను గుర్తించిన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్స్

Israel-Hamas: గాజాలోని సామాన్య పౌరులు, ఆస్పత్రులను హమాస్‌ తమ రక్షణ కవచాలుగా వాడుకుంటోందని ఆరోపిస్తోన్న ఇజ్రాయెల్‌ దళాలు.. తాజాగా దాన్ని బలపర్చే సాక్ష్యాలను బయటపెట్టాయి. గాజాలో హమాస్ వేటను సాగిస్తున్న ఐడీఎఫ్‌ సేనలు.. హమాస్‌కు చెందిన ఓ సొరంగాన్ని గుర్తించాయి. బుల్లెట్‌ ప్రూఫ్‌తో పటిష్టంగా ఉన్న ఆ టన్నెల్‌.. చిన్నారుల ఆస్పత్రికి అనుసంధానంగా ఉండటంతో షాక్ గురిచేసిందని ఐడీఎఫ్ అధికారి పేర్కొన్నారు. ఆ ఆస్పత్రి కింద ఉన్న హమాస్‌ కమాండ్‌ సెంటర్‌లో పెద్ద ఎత్తున ఆయుధాలు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోను ఐడీఎఫ్‌ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

హమాస్‌ కమాండర్‌ ఇంటికి సమీపంలో ఈ సొరంగాన్ని గుర్తించినట్లు ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి డేనియల్‌ హంగరీ ఆ వీడియోలో వెల్లడించారు. సోలార్‌ ప్యానెళ్లతో ఆ టన్నెల్‌కు విద్యుత్‌ సరఫరా జరుగుతున్నట్లు ఐడీఎఫ్‌ గుర్తించింది. భూ ఉపరితలానికి 20 మీటర్ల లోపల ఉన్న ఆ సొరంగానికి బుల్లెట్‌ ప్రూఫ్‌ డోర్‌ ఉన్నట్లు డేనియల్‌ పేర్కొన్నారు. ఆ సొరంగం లోపలికి డేనియల్‌ నడుచుకుంటూ వెళ్లగా.. టన్నెల్‌కు మరో చివరన అల్‌-రాంటిస్‌ ఆస్పత్రి బేస్‌మెంట్‌ ఉన్నట్లు గుర్తించారు. ఇక, ఇజ్రాయెల్‌ నుంచి కిడ్నాప్ చేసిన పౌరులను హమాస్‌ ఈ టన్నెల్‌లోనే బందీలుగా దాచి ఉంచినట్లు తెలుస్తోంది.

యుద్ధానికి ముందు ఈ ఆస్పత్రిలో చిన్నారులు, క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించేవారని డేనియల్‌ తెలిపారు. ఆస్పత్రుల నుంచి హమాస్‌ తమ కమాండ్‌ సెంటర్లను నిర్వహిస్తోందని ఇజ్రాయెల్‌ పదే పదే ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే గాజాలోని అతిపెద్ద ఆస్పత్రి అల్‌-షిఫాను ఐడీఎఫ్‌ దళాలు చుట్టుముట్టాయి. విద్యుత్‌, వైద్య పరికరాల సరఫరా నిలిచిపోయి రోగులు ప్రాణాలు కోల్పోతున్నారని గాజా వైద్యారోగ్య శాఖ తెలిపింది. దీంతో అల్‌-షిఫా వద్ద పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్‌ తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోరింది. ఈ నేపథ్యంలోనే ఐడీఎఫ్‌ తాజాగా హమాస్‌ సొరంగం వీడియోను బయటపెట్టింది.

Show Full Article
Print Article
Next Story
More Stories