Top
logo

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో పేలుళ్లకు బాధ్యత వహించిన ఐసిస్

Islamic State Militant Group takes Responsibility for Suicide Blasts in Kandahar
X

ఆఫ్ఘనిస్తాన్‌లో పేలుళ్లకు బాధ్యత వహించిన ఐసిస్(ఫైల్ ఫోటో)

Highlights

* తమ ఉగ్రవాదులే దాడికి పాల్పడ్డారని ప్రకటన

Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి దాడి తమ పనే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులు ఆత్మాహుతికి పాల్పడినట్లు ప్రకటన విడుదల చేసింది. మసీదు దగ్గర ఉన్న గార్డులను తమ ఉగ్రవాదులు కాల్చి చంపారని, ఆ తర్వాత మసీదులోకి ప్రవేశించినట్లు తెలిపింది. లోపలికి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు ప్రార్థనలు చేస్తున్న వారిలో కలిసిపోయి, ప్రార్థనలు ముగిసే సమయానికి తమను తాము పేల్చుకున్నారని తెలిపింది. ఈ దాడిలో 47 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.

Web TitleIslamic State Militant Group takes Responsibility for Suicide Blasts in Kandahar Afghanistan
Next Story