శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా..?

శృంగారం ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందా..?
x
representative image
Highlights

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనాతో బాధపడే వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. అందుకే...

ప్రపంచ దేశాలను కరోనా వైరస్‌ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనాతో బాధపడే వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని తెలిసిందే. అందుకే ప్రభుత్వాలు భౌతికదూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, ఇళ్లకే పరిమితం కావాలని ప్రజలకు సూచిస్తున్నాయి. మరి శృంగారం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందా? అంటే తాజాగా చైనాలోని కొంతమంది పరిశోధకులు దీనిపై అధ్యయనం చేసి, నివేదిక విడుదల చేశారు. వీర్యంలో కరోనా వైరస్‌ ఉండటాన్ని వీరు గుర్తించారు. అయితే, దీని వల్ల వ్యాధి వ్యాపిస్తుందా? లేదా? అన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

చైనాకు చెందిన ఓ అధ్యయన బృందం ఈ అంశంపై షాంగిక్యూ మున్సిపల్‌ ఆస్పత్రిలో కరోనా వైరస్‌తో బాధపడుతున్న 38మందిపై పరిశోధన చేసింది. అందులో ఆరుగురి వీర్యంలో వైరస్‌ ఉన్నట్లు తేలింది. ఈ ఆరుగురిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ఇద్దరు కోలుకున్నారు. వీర్యంలో ఈ వైరస్‌ ఇలా ఎన్నిరోజులు ఉంటుందన్న విషయం మాత్రం తెలియడం లేదని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే శృంగారం ద్వారా భాగస్వామికి ఈ వైరస్‌ సంక్రమిస్తుందా అనే విషయంలో కూడా స్పష్టత లేదన్నారు.

కరోనా వైరస్‌ బారిన పడి కోలుకుని ఎనిమిది రోజులైన వారితో పాటు మూడు నెలల పూర్తి చేసుకున్న వ్యక్తుల వీర్యంపై అమెరికా, చైనా పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరెవ్వరి వీర్యంలోనూ కరోనా వైరస్‌ను గుర్తించలేదు. కరోనాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న మరికొంత మందిపై పరిశోధన చేస్తున్నట్లు తెలిపారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories