నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు.. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో...

International Flight Services Starting Today 27 03 2022 | Live News
x

నేటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు.. రెండేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో...

Highlights

International Flight Services: *ఎయిర్‌పోర్టులు, విమానయాన సంస్థలు సంసిద్ధం *మాస్క్, కొవిడ్ నిబంధనలు తప్పనిసరి

International Flight Services: రెండేళ్ల తర్వాత ఇవాళ్టి నుంచి అంతర్జాతీయ సర్వీసులు పూర్తిస్థాయిలో తిరగనున్నాయి. ఈ మేరకు విమానయాన సంస్థలు, విమానాశ్రయాలు ఏర్పాట్లు సిద్ధం చేశాయి. వచ్చే వారం నుంచి ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి. కాగా, కొవిడ్‌ వ్యాప్తితో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు.

37 దేశాలతో ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం కుదుర్చుకుని ఆ ఏడాది జూలై నెల నుంచి సర్వీసులు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయ సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు ఈ నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం అనుమతిలిచ్చింది. వైరస్‌ కారణంగా విధించిన ఆంక్షలను తొలగిస్తూ కొత్త మార్గదర్శకాలిచ్చింది. దీనిప్రకారం విమాన ప్రయాణికులు మాస్క్‌లు ధరించడం, శానిటైజ్‌ చేసుకోవడం కచ్చితమని పేర్కొంది. సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

అయితే, ఎవరైనా ప్రయాణికులు లేదా సిబ్బంది శ్వాసకోశ సంబంధ ఇబ్బందులను ఎదుర్కొంటే సాయం అందిచేందుకు కొన్ని పీపీఈ కిట్లను ముందుజాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించింది. ఇక ప్రస్తుతం విమానంలో మూడు సీట్లను అత్యవసర వైద్య అవసరాలు, భద్రతా సిబ్బందికి ప్రత్యేకిస్తున్నారు. ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. గతంలో ప్రయాణికులను విమానాశ్రయంలో తనిఖీ చేసేవారు. కొవిడ్‌ వ్యాప్తి రీత్యా దానిని ఎత్తివేశారు. ఇప్పుడు పునరుద్ధరించనున్నారు. కాగా, సర్వీసుల ప్రారంభం నేపథ్యంలో పలు సంస్థలు అందుకుతగ్గట్లు సిద్ధమయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories