వైద్య విద్యకు ఉక్రెయిన్‌కే ఎందుకు?

Interest Among Indian Students on Medical Education in Ukraine
x

వైద్య విద్యకు ఉక్రెయిన్‌కే ఎందుకు?

Highlights

*ఉక్రెయిన్‌ వైద్య విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి *ఉక్రెయిన్‌లో రూ.25లక్షలతో పూర్తి

Medical Education in Ukraine: ఉక్రెయిన్‌ యుద్ధంతో భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రోజు రోజుకు యుద్ధం ముదురుతుండడంతో వారిని తరలించేందుకు భారత ప్రభుత్వం శ్రమిస్తోంది. మరోవైపు యుద్ధంలో భారతీయ విద్యార్థి మృతి చెందాడన్న వార్త.. అందరిలోనూ విషాదం నింపింది. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు వేలాది మంది విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కే ఎందుకు వెళ్తున్నారు? మన దేశంలో అంతర్జాతీయ ప్రమాణాలు లేవా? అనే ప్రశ్నలు భారతీయుల మదిలో రేకెత్తుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఈ ఏడాది 15 లక్షల 44 మందికి పైగా విద్యార్థులు నీట్‌ పరీక్షను రాశారు. వారిలో 8 లక్షల 70 వేల మంది అర్హత సాధించారు. కానీ.. దేశవ్యాప్తంగా కేవలం 85వేల ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో నీట్‌లో అర్హత సాధించినప్పటికీ మెడికల్‌ సీట్లు పొందలేకపోతున్నారు. ప్రైవేటు కళాశాలల్లో ఏడాదికి 15 లక్షల రూపాయల పైగా ఖర్చు అవుతోంది. హాస్టల్ ఫీజు, పుస్తకాలు.. అంటూ కోర్సు పూర్తయ్యేసరికి 80 లక్షల రూపాయల మేర ఖర్చు అవుతోంది. దీంతో మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారింది.

అయితే ఉక్రెయిన్‌, జార్జియా, అర్మేనియా, కజికిస్థాన్‌, చైనా, రష్యా, కిర్గిస్థాన్‌ దేశాల్లో మెడిసిన్ చదివేందుకు మన దేశంలో కంటే తక్కువగానే ఖర్చవుతోంది. దీంతో మధ్యతరగతికి చెందిన పలువురు విద్యార్థులు ఆయా దేశాల్లో వైద్య విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉక్రెయిన్‌లో అన్ని దేశాల కంటే వైద్య విద్య ఫీజులు మరీ తక్కువగా ఉంటున్నాయి. కేవలం 25 లక్షల్లోపే మెడిసిన్‌ పూర్తయ్యే అవకాశముంది. పైగా అదనపు ఫీజుల బాధుడు అస్సలు ఉండదు. స్థానిక ప్రజలు కూడా ఫ్రెండ్లీ నేచర్‌తోనే ఉంటారు.

ఇక ఆయా దేశాల్లో స్థానిక భాషలోనే వైద్య విద్యను బోధిస్తున్నారు. అయితే ఉక్రెయిన్‌ యూనివర్సిటీల్లో మెడిసిన్‌ను ఆంగ్లంలోనే బోధిస్తారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌ మెడికల్‌ యూనివర్సీటీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు కూడా ఉంది. ఇది భారతీయ విద్యార్థులు ఎంతో మేలు చేస్తోంది. ఇదే కాకుండా.. ఇతర దేశాలో పోల్చుకుంటే ఇక్కడి వాతావరణం కూడా భారతీయులకు కలిసొస్తోంది. వసతుల విషయంలోనూ ఖర్చులు కలిసొస్తాయి. ఎన్నో సానుకూల అంశాలు ఉండడంతో భారతీయ విద్యార్థులు వైద్య విద్యను చదివేందుకు ఉక్రెయిన్‌నే మొదటి ఆప్షన్‌గా ఎంచుకుంటారు. ఉక్రెయిన్‌లో మెడిషన్‌ పూర్తి చేసిన తరువాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌కు పాస్‌ అయితే మన దేశంలోనూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 18వేల మందికి పైగా భారతీయ విద్యార్థులు చిక్కుకున్నట్టు సమాచారం. వారిలో 3వేల మంది వరకు తెలుగు విద్యార్థులు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు 8వేల మందిని ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు చేరుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మరో 14 వేల మంది భారత పౌరులు, విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని.. ప్రతి ఒక్కరినీ దేశానికి తరలిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories