Vijay Shankar nominate as SC Judge: ఇండో- అమెరికన్‌కు కీలక పదవి.. వాషింగ్టన్‌ డీసీ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా విజయ్‌ శంకర్‌

Vijay Shankar nominate as SC Judge: ఇండో- అమెరికన్‌కు కీలక పదవి.. వాషింగ్టన్‌ డీసీ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా విజయ్‌ శంకర్‌
x
Highlights

Donald Trump: వాషింగ్టన్‌ డీసీ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా భారత సంతతికి చెందిన ఇండో- అమెరికన్‌ విజయ్‌ శంకర్‌ నామినేట్‌ చేయాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

వాషింగ్టన్‌ డీసీ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా భారత సంతతి కి చెందిన ఇండో- అమెరికన్‌ విజయ్‌ శంకర్‌ నామినేట్‌ చేయాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

ట్రంప్‌ ప్రతిపాదనలు సెనేట్‌ ఆమోదం తెలిపిన పక్షంలో విజయ్‌ శంకర్‌ వాషింగ్టన్‌ డీసీలోని డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ అసోసియేట్‌ జడ్జిగా సేవలు అందించనున్నారు.

కాగా.. విజయ్‌ శంకర్‌ డ్యూక్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా డిగ్రీ అందుకున్నారు. అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్‌ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత యునైటెడ్‌ స్టేట్స్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ జడ్జి చెస్టెర్‌ జే. స్ట్రాబ్‌ వద్ద లా క్లర్క్‌గా ఉన్నారు.

ఇక ప్రస్తుతం విజయ్‌ శంకర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ క్రిమినల్‌ విభాగంలో సీనియర్‌ లిటిగేషన్‌ కౌన్సెల్‌గా..అప్పీలెట్‌ సెక్షన్‌ డిప్యూటీ చీఫ్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చేరడానికి ముందు వాషింగ్టన్‌లో ఆయన ప్రైవేటు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. అంతర్జాతీయ స్థాయిలా కంపెనీలైన మేయర్‌ బ్రౌన్‌, ఎల్‌ఎల్‌సీ కోవింగ‍్టన్ అండ్‌ బర్లింగ్‌, ఎల్‌ఎల్‌పీలో పనిచేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డి యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే. తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల సరిత స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు వైద్యులు కావడంతో వారు అమెరికాలో స్థిరపడ్డారు.వాషింగ్టన్‌ డీసీ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిగా భారత సంతతికి చెందిన ఇండో- అమెరికన్‌ విజయ్‌ శంకర్‌ నామినేట్‌ చేయాలనుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు.

ట్రంప్‌ ప్రతిపాదనలు సెనేట్‌ ఆమోదం తెలిపిన పక్షంలో విజయ్‌ శంకర్‌ వాషింగ్టన్‌ డీసీలోని డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ అసోసియేట్‌ జడ్జిగా సేవలు అందించనున్నారు.

కాగా.. విజయ్‌ శంకర్‌ డ్యూక్‌ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా స్కూల్‌ ఆఫ్‌ లా నుంచి జ్యూరిస్‌ డాక్టర్‌గా డిగ్రీ అందుకున్నారు. అనంతరం అక్కడే వర్జీనియా లా రివ్యూ నోట్స్‌ ఎడిటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత యునైటెడ్‌ స్టేట్స్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ జడ్జి చెస్టెర్‌ జే. స్ట్రాబ్‌ వద్ద లా క్లర్క్‌గా ఉన్నారు.

ఇక ప్రస్తుతం విజయ్‌ శంకర్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ క్రిమినల్‌ విభాగంలో సీనియర్‌ లిటిగేషన్‌ కౌన్సెల్‌గా..అప్పీలెట్‌ సెక్షన్‌ డిప్యూటీ చీఫ్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చేరడానికి ముందు వాషింగ్టన్‌లో ఆయన ప్రైవేటు లాయర్‌గా ప్రాక్టీసు చేశారు. అంతర్జాతీయ స్థాయిలా కంపెనీలైన మేయర్‌ బ్రౌన్‌, ఎల్‌ఎల్‌సీ కోవింగ‍్టన్ అండ్‌ బర్లింగ్‌, ఎల్‌ఎల్‌పీలో పనిచేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డి యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌ జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే. తెలంగాణలోని నల్లగొండ జిల్లా చిట్యాల సరిత స్వస్థలం. ఆమె తల్లిదండ్రులు వైద్యులు కావడంతో వారు అమెరికాలో స్థిరపడ్డారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories