US President: అమెరికా అధ్యక్షుడి హత్యకు 19 ఏళ్ల తెలుగు సంతతి యువకుడి కుట్ర.. ట్రక్కుతో వైట్‌హౌజ్‌పై దాడి

US President: అమెరికా అధ్యక్షుడిగా లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడి

Dhatripriya
Published on: 24 May 2023 10:30 AM IST
Indian Origin Sai Varshith Charged With Threatening To Kill Usa President Joe Biden
X

US President: అమెరికా అధ్యక్షుడి హత్యకు 19 ఏళ్ల తెలుగు సంతతి యువకుడి కుట్ర.. ట్రక్కుతో వైట్‌హౌజ్‌పై దాడి

US President: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. భారీ ట్రక్‌తో సాయివర్షిత్ అనే యువకుడు వైట్‌హౌజ్‌లోకి దూసుకువచ్చేందుకు ప్రయత్నించాడు. ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొడుతూ వైట్ హౌజ్ ట్రక్‌తో దూసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన వైట్ హౌజ్ భద్రతాదళం సాయివర్షిత్‌ను అదుపులోకి తీసుకుంది. ట్రక్‌పై నాజీ ఎండాను పోలీసులు గుర్తించారు. ప్రెసిడెంట్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ట్రక్‌తో విధ్వంసానికి తెగబడినట్లు అమెరికా పోలీసులు భావిస్తున్నారు.

19 ఏళ్ల సాయివర్షిత్‌ అమెరికాలోని ఛెస్ట్‌ఫీల్డ్‌ ప్రాంతానికి చెందినవాడిగా తెలుస్తోంది. మార్క్వెట్‌ సీనియర్‌ హైస్కూల్‌‌లో పాఠశాల విద్యపూర్తి చేశాడు. ట్రక్‌ను అద్దెకు తీసుకుని వైట్ వద్దకు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.అమెరికా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని ఈ విధ్వంసం ఎందుకు సృష్టించాడు...? వాషింగ్టన్ డీసీకి ఎప్పుడు వచ్చాడు...? సాయివర్షిత్ వెనుక మరెవరైనా ఉన్నారా..? అన్న కోణాల్లో వైట్ హౌజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story