కులభూషన్ జాదవ్‌‌‌ను కలిసిన భారత దౌత్యవేత్తలు

కులభూషన్ జాదవ్‌‌‌ను కలిసిన భారత దౌత్యవేత్తలు
x
Highlights

పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల భూషణ్‌ జాదవ్‌తో మన దేశ దౌత్యవేత్తలు భేటీ అయ్యారు. సుమారు గంట సేపు జాదవ్‌తో మాట్లాడేందుకు పాక్...

పాకిస్థాన్ చెరలో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికారి కుల భూషణ్‌ జాదవ్‌తో మన దేశ దౌత్యవేత్తలు భేటీ అయ్యారు. సుమారు గంట సేపు జాదవ్‌తో మాట్లాడేందుకు పాక్ అధికారులు అవకాశమివ్వడంతో పలు అంశాలపై చర్చించారు. గూఢచర్యం ఆరోపణలపై జాదవ్‌కు పాక్‌ సైనిక కోర్టు మరణ శిక్ష విధించింది. ప్రస్తుతం పాకిస్థాన్‌లోని జైలులో ఉన్న జాదవ్‌ను కలిసేందుకు భారత దౌత్యవేత్తలు తీవ్రంగా ప్రయత్నించారు. ICJ ఆదేశించడంతో పాక్ ఓ మెట్టు దిగింది. జాదవ్‌ను కలిసేందుకు అనుమతిచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories