USA: కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి

USA: అనుమానాస్పద స్థితిలో మరణించిన దంపతులు, కవల పిల్లలు

Jyothi
Published on: 15 Feb 2024 7:32 AM IST
Indian Family Found Dead in California Home
X

USA: కాలిఫోర్నియాలో భారతీయ కుటుంబం అనుమానాస్పద మృతి 

USA: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారతీయ కుటుంబం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. మృతుల్లో నాలుగేండ్ల వయసున్న కవలలు కూడా ఉన్నారు. అగ్రరాజ్యంలో భారతీయ కుటుంబం మృతి చెందడం రెండు నెలల్లో ఇది రెండోది. దీనికి తోడు అమెరికాలోని పలు ప్రాంతాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు, విద్యార్థుల వరుస మరణాలు అమెరికాలోని భారతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి.

కేరళకు చెందిన ఆనంద్‌ సుజీత్‌ హెన్రీ, ఆయన భార్య అలైస్‌ ప్రియాంక, వారి కుమారులను విగతజీవులుగా గుర్తించారు. రోజంతా కుటుంబం కనిపించకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారొచ్చి చూడగా విషాదం వెలుగు చూసింది. భార్యాభర్తల శరీరాలపై తుపాకి గాయాలు ఉన్నాయి. చిన్నారుల మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేవు. పోస్టుమార్టం తర్వాత మరణానికి కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు. కాగా, 2016లో సుజీత్‌ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. ఆ కేసు ఇంకా విచారణలో ఉంది. వీరి మరణాలకు బహుశా కుటుంబ కలహాలే కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story