Dunki Route: డంకీ రూట్లో అమెరికా వెళ్తూ..భారతీయుడు దుర్మరణం

Indian dies while traveling to America via Dunky route
x

Dunki Route: డంకీ రూట్లో అమెరికా వెళ్తూ..భారతీయుడు దుర్మరణం

Highlights

Dunki Route: అక్రమంగా తమ దేశానికి వచ్చిన 104 మంది భారతీయులను ఇటీవల అమెరికా తిప్పి పంపించిన సంగతి తెలిసిందే. దీంతో అగ్రరాజ్యం అమెరికాలోకి అక్రమంగా...

Dunki Route: అక్రమంగా తమ దేశానికి వచ్చిన 104 మంది భారతీయులను ఇటీవల అమెరికా తిప్పి పంపించిన సంగతి తెలిసిందే. దీంతో అగ్రరాజ్యం అమెరికాలోకి అక్రమంగా వెళ్లగలిగే మార్గాలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ పంజాబీ యువకుడు డంకీ రూట్ లో అమెరికా వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన వెలుగుచూసింది. 33ఏండ్ల గుర్ ప్రీత్ సింగ్ గ్వాటెమాలాలో గుండెపోటుకు గురై మరణించాడు. ఈ విషయాన్ని మ్రుతుడి కుటుంబ సభ్యులు మీడియాకు వెల్లడించారు. నా సోదరుడు గుర్ ప్రీత్ అమెరికా వెళ్లేందుకు 3 నెలల కిందట ఇంటి నుంచి బయలుదేరాడు. ఇందుకోసం చండీగఢ్ లోని ఏజెంట్ బల్వీందర్ సింగ్ ను సంప్రదించాడు.

అతను రూ. 16.5లక్షలు తీసుకుని నా సోదరుడిని గయానా పంపించాడు. అక్కడ ఓ పాకిస్థానీ ఏజెంట్ కు అప్పగించాడు. అనంతరం మరికొందరు వలసదారులతో కలిసి పనామా అడవి గుండా కొలంబియాకు బయలుదేరాడు. మధ్యలో ఓసారి మాకు ఫోన్ చేసి గ్వాటమాలాలోని హోటల్ లో ఉన్నట్లు చెప్పారు. ఆ తర్వాత ఇటీవల ఓ వ్యక్తి మాకు ఫోన్ చేసి గుర్ ప్రీత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. కారులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడని తెలిపాడు. ఆ తర్వాత ఐదారు నిమిషాలకే నా సోదరుడు చనిపోయినట్లు సమాచారం ఇచ్చారు అని గుర్ ప్రీత్ సోదరుడు తారాసింగ్ మీడియాకు వివరిస్తూ కన్నింటిపర్యమంతమయ్యారు. తన సోదరుడి డెడ్ బాడీ తీసుకువచ్చేందుకు సాయం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories