Coronavirus: త్వరలో చైనా నుండి 20 విమానాల ద్వారా వైద్య సామాగ్రి : కేంద్రం

Coronavirus: త్వరలో చైనా నుండి 20 విమానాల ద్వారా వైద్య సామాగ్రి : కేంద్రం
x
Highlights

చైనా నుండి భారత్‌కు తెప్పించిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్ల నుండి ఫలితాల రేట్ తక్కువగా వస్తుందని నివేదికలు వచ్చినప్పటికీ, చైనా నుండి వైద్య సామాగ్రిని దిగుమతి చేసుకోవడం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చైనా నుండి భారత్‌కు తెప్పించిన ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్ల నుండి ఫలితాల రేట్ తక్కువగా వస్తుందని నివేదికలు వచ్చినప్పటికీ, చైనా నుండి వైద్య సామాగ్రిని దిగుమతి చేసుకోవడం కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.మరో 20 విమానాలు చైనా నుండి సామాగ్రిని తీసుకువస్తాయని గురువారం విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ మేరకు విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి, అనురాగ్ శ్రీవాస్తవ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత రెండు వారాల్లో, చైనాలోని ఐదు నగరాల నుండి రెండు డజను విమానాల ద్వారా ఆర్టి-పిసిఆర్ పరీక్షా వస్తు సామగ్రితో సహా దాదాపు 400 టన్నుల వైద్య సామాగ్రిని తీసుకొని వచ్చాయని తెలిపారు. ఇందులో యాంటీబాడీ పరీక్షల కిట్ లు, పిపిఇ కిట్లు, థర్మామీటర్లు మొదలైనవి వచ్చాయి.. ఇక రాబోయే రోజుల్లో కూడా మరో 20 విమానాలు చైనా నుండి వైద్య సామాగ్రిని తీసుకువస్తాయని తెలిపారు.

కాగా ఇప్పటివరకు, చైనా, దక్షిణ కొరియా , సింగపూర్‌లోని సంస్థల నుండి 37 లక్షల వేగవంతమైన యాంటీబాడీ టెస్టింగ్ కిట్‌ల కొనుగోలు కోసం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు కేవలం 7 లక్షల కిట్లు మాత్రమే భారతదేశానికి చేరుకున్నాయి. ఇదిలావుంటే చైనా నుండి ఆర్డరు చేసిన 1 లక్షల కరోనా రాపిడ్ టెస్ట్ కిట్ ఆర్డర్‌ను హర్యానా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. చైనాకు చెందిన రెండు కంపెనీల ఆర్డర్‌లను రద్దు చేసి దక్షిణ కొరియా కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది ఆ రాష్ట్రం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories