logo
ప్రపంచం

ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్

India Slams Pakistan at UN Security Council
X

ఐరాసలో పాకిస్తాన్ చెంప చెళ్లుమనిపించిన భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్

Highlights

Kajal Bhat: ఐరాస భద్రతా మండలిలో మరోసారి పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది భారత్.

Kajal Bhat: ఐరాస భద్రతా మండలిలో మరోసారి పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది భారత్. కశ్మీర్ అంశంపై భారత ప్రతినిధి డాక్టర్ కాజల్ భట్ మాట్లాడుతూ పాక్ దళాలు కశ్మీర్‌ను ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో పూర్తి భూభాగం భారత్ అంతర్భాగం అన్న కాజల్ వీటిల్లో పాక్ ఆక్రమిత భూభాగాలు కూడా ఉన్నాయన్నారు. పాక్ అక్రమంగా చొరబడిన భూభాగాల నుంచి వైదొలగాలని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఐరాస నిషేధిత ఉగ్రవాదులు అత్యధికంగా ఆశ్రయం పొందుతున్న దేశంగా కూడా పాకిస్తాన్‌కు అప్రతిష్ట ఉందని కౌంటర్లు వేశారు. పాకిస్థాన్‌తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం, హింస లేని వాతావరణంలోనే జరుగుతాయని కాజల్ భట్ స్పష్టం చేశారు.

Web TitleIndia Slams Pakistan at UN Security Council
Next Story