Corona Cases: బ్రిటన్‌లో పెరుగుతున్న కరోనా కేసులు
Corona Cases: డెల్టా వేరియంట్‌లో కొత్త మ్యుటేషన్ * డెల్టా ప్లస్‌తో బ్రిటన్‌లో పెరుగుతున్న కేసులు
Representational Image
Corona Cases: బ్రిటన్‌ను కరోనా పీడ వదలడం లేదు. రెండు వారాలుగా 35 నుంచి 40 వేల మధ్య నమోదైన రోజువారీ కేసులు 50 వేలకు చేరువయ్యాయి. డెల్టా ప్లస్‌గా పిలుస్తున్న మార్పు కారణంగానే బ్రిటన్‌లో కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు భావిస్తున్నారు. కోవిడ్ కేసులు, ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాలు క్రమంగా పెరుగుతున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అన్నారు. అయితే ఇందుకు డెల్టా ప్లస్సే కారణమని చెప్పలేమన్నారు. టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నట్లు తెలిపారు.
Next Story




