Eiffel Tower: పెరిగిన ఈఫిల్ టవర్ ఎత్తు

Eiffel Tower: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎత్తు పెరిగింది.

Rama Rao
Updated on: 16 March 2022 6:30 AM IST
Increased Eiffel Tower Height | Telugu News Today
X

Eiffel Tower: పెరిగిన ఈఫిల్ టవర్ ఎత్తు

Eiffel Tower: ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని ఈఫిల్ టవర్ ఎత్తు పెరిగింది. కొత్తగా ఈ టవర్ అగ్రభాగాన ఓ డిజిటల్ రేడియో యాంటెన్నా ఏర్పాటు చేశారు. దీని పొడవు 6 మీటర్లు. ఓ హెలికాప్టర్ సాయంతో ఈ రేడియో యాంటెన్నాను ఈఫిల్ టవర్ అగ్రభాగాన అమర్చారు. దాంతో ఈఫిల్ టవర్ పూర్తి ఎత్తు 330 మీటర్లకు పెరిగింది. ఈఫిల్ టవర్ బాగా ఎత్తుగా ఉండడంతో దీనికి అనేక టెలివిజన్, రేడియో ట్రాన్స్ మిటర్లు అమర్చారు. చాలాకాలంగా ఇది బుల్లితెర, రేడియో ప్రసారాలకు ఉపకరిస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story