US GUNFIRE: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. నలుగురు వ్యక్తులు మృతి

US GUNFIRE: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేపాయి. నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Sept 2024 7:39 PM IST
US GUNFIRE
X

US GUNFIRE

US GUNFIRE: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. అలబామా రాష్ట్రంలోని ఓ బార్‌లో తాజాగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఫైవ్ పాయింట్స్ సౌత్ ప్రాంతంలో ఉన్న బార్‌లోకి శనివారం అర్ధరాత్రి అకస్మాత్తుగా చొరబడిన దుంగడులు పౌరులపై సామూహిక కాల్పులకు తెగపడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరు పరిస్థితి విషమించి ఆస్పత్రిలో మరణించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story