పాక్ పార్లమెంట్ కు ఇమ్రాన్ రాజీనామా

Imran Khan Resignation: భారీ సంఖ్యలో వీధుల్లోకెక్కిన ఇమ్రాన్ మద్దతుదారులు

Rama Rao
Updated on: 11 April 2022 7:15 PM IST
Imran Khan Resigns from Pakistan Parliament | Telugu Online News
X

పాక్ పార్లమెంట్ కు ఇమ్రాన్ రాజీనామా

Imran Khan Resignation: పాక్ లో నూతన ప్రధాని ఎన్నిక ప్రక్రియలో పాల్గొనబోమంటూ ఇమ్రాన్ పార్టీ పీటీఐ సభ్యులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ప్రధానిని ఎన్నుకునేందుకు నేషనల్ అసెంబ్లీ సమావేశం కావడానికి ముందే పీటీఐ సభ్యులంతా రాజీనామా చేశారు. ఈ దొంగల నడుమ కూర్చోవడం ఇష్టం లేదంటూ ఇమ్రాన్ కూడా నేషనల్ అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన పార్టీ సభ్యులంతా రాజీనామా చేయాలని ఆదేశించడంతో వారు అలాగే చేశారు.

ఇక ప్రధానిగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు పార్లమెంట్ లో అవిశ్వాసంలో ఓడిపోయాక ప్రజలందరూ నిరసన తెలపాలని కోరారు. దీంతో నిన్న రాత్రి నుంచి ఇస్లామాబాద్ సహా అనేక పట్టణాల్లో ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. ఈ ప్రక్రియతో పాక్ లో అంతర్యుద్ధం తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

Rama Rao

Rama Rao

Next Story