భారత్‌పై మళ్లీ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రశంసల జల్లు

Imran Khan Praises Indias Foreign Policy
x

భారత్‌పై మళ్లీ ఇమ్రాన్‌ఖాన్‌ ప్రశంసల జల్లు

Highlights

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించాడు.

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్‌పై ప్రశంసలు కురిపించాడు. ప్రజల మేలు కోసం అమెరికా ఒత్తిడిని కూడా ఎదుర్కొన్నట్టు ఇమ్రాన్‌ చెప్పారు. రష్యా చమురును కొనుగోలు చేసి ధరలను తగ్గించిందని కొనియాడారు. స్వతంత్ర విదేశాంగ విధానంతో భారత్‌ సరైన మార్గంలో నడుస్తోందని మాజీ ప్రధాని కీర్తించారు. క్వాడ్ దేశాల కూటమిలో భారత్‌ సభ్య దేశమైనప్పటికీ అమెరికా భారత్‌పై తీవ్ర ఒత్తిడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రష్యా చమురు కొనుగోలుపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించింది. లీటరు పెట్రోలుపై తొమ్మిదిన్నర, డీజిల్‌పై 7 రూపాయల ఎక్సైజ్‌ సుంకాన్ని కేంద్రం తగ్గించింది. ఈ విషయం తెలుసుకున్న ఇమ్రాన్‌ఖాన్‌ తాజాగా ట్వీట్‌ చేశారు. పీటీఐ ఆధ్వర్యంలోని తమ ప్రభుత్వం కూడా స్వతంత్ర విదేశాంగ విధానంతో పని చేసిందని చెప్పుకొచ్చారు. భారత్‌లాగే రష్యా చమురు కొనుగోలుకు యత్నించామని మాజీ ప్రధాని చెప్పుకొచ్చారు.

పాకిస్థాన్‌లో ఆర్థిక వ్యవస్థ తల లేని కోడిలా పరిగెడుతోందని పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్ ఖాన్‌ విమర్శించారు. మీర్ జాఫర్లు, మీర్‌ సాధిక్‌లు విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గి తమ ప్రభుత్వాన్ని కూల్చేశారని ఆరోపించారు. భారత్‌లాగే స్వతంత్ర విదేశాంగ విధానంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేసి అసమర్థులకు అప్పగించారని మాజీ ప్రధాని విమర్శలు గుప్పించారు. దొంగల చేతిలో పడి పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ తలలేని కోడిలో పరిగెడుతోందని ఆరోపించారు. పాకిస్థాన్‌ అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేసిందని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు. పాకిస్థాన్‌ను ప్రస్తుత పాలకులు భ్రస్టుపట్టిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల తరచూ భారత్‌ విదేశాంగ విధానాన్ని ఇమ్రాన్‌ ప్రశంసిస్తున్నారు. తాజాగా పెట్రోలు ధరలు తగ్గింపుపైనా మరోసారి కొనియాడారు.

Show Full Article
Print Article
Next Story
More Stories