Public Urination: గోడలపై మూత్రం పొస్తే.. తిరిగి వారిపైనే పడేలా రసాయనాలు..

Public Urination: ఇచ్ఛట మూత్రం పోయరాదు.. అని బహిరంగ ప్రదేశాల్లో చాలా చోట్ల కనిపిస్తుంటుంది.

Arun Chilukuri
Updated on: 21 Jan 2023 8:30 PM IST
If You Urinate On The Wall It Will Spill On You
X

Public Urination: గోడలపై మూత్రం పొస్తే.. తిరిగి వారిపైనే పడేలా రసాయనాలు..

Public Urination: ఇచ్ఛట మూత్రం పోయరాదు.. అని బహిరంగ ప్రదేశాల్లో చాలా చోట్ల కనిపిస్తుంటుంది. కానీ అక్కడే పలువురు మూత్రం పోయడం చూస్తూనే ఉంటాం. ఈ పాడు పనితో పలు ప్రాంతాల్లో వెళ్లాలంటేనే దుర్గంధం వెదజల్లుతుంది. బహిరంగ మూత్ర విసర్జనను అరికట్టేందుకు మున్సిపాలిటీలు ప్రత్యేకంగా కృషి చేస్తున్నా ఫలితం లేకుండా పోతున్నది. ఇలాంటి సమస్య మన దేశంలోనే కాదు బ్రిటన్‌లోనూ ఉంది. అయితే లండన్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. అందుకే లండన్‌ మున్సిపాలిటీ యంత్రాంగం బహిరంగ మూత్ర విసర్జనకు విరుగుడును కనిపెట్టింది. ఎవరైనా గోడలపై మూత్రం పోస్తే.. వారిపైకే రివర్స్‌లో చిందేలా చేసింది. అలా చేస్తేనైనా ఈ పాడు పని ఆగుతుందని భావించింది. అందుకు నీటిని వికర్శించే రసాయనాలను అందుబాటులోకి తెచ్చింది. దీనిని గోడలపై స్ప్రే చేస్తే మూత్రం పోసిన వ్యక్తి పైకే చిందుంతుంది. అదే వారికి తగిన శిక్ష అవుతుందని మున్సిపల్‌ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ సిటీ కౌన్సిల్‌లోని సోహో ప్రాంతాన్ని ఎంచుకుంది.

నిజానికి సోహోనే ఎందుకు ఎంచుకుందంటే అక్కడ 24 గంటలూ నడిచే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్లు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్లతో పాటు నివాస ప్రాంతాలు ఉన్నాయి. సోహోలో 400కు పైగా ప్రాంతాల్లో మద్యం విక్రయాలు జోరుగా జరుగుతుంటాయి. ఇక్కడ పబ్లిక్‌ టాయిలెట్లు చాలినన్ని లేకపోవడంతో జనం రోడ్డు పక్కన గోడలపైనే మూత్రం పోసేస్తున్నారు. వీధులు దుర్గంధంతో నిండిపోతుండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వీధులను శుభ్రంగా ఉంచేందుకు లండన్‌ యంత్రాంగం ఏటా 10 కోట్లా 26 లక్షలను యంత్రాంగం వెచ్చిస్తోంది. అయినా ఫలితం లేకపోవడంతో తాజాగా కొత్త ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చింది. ముందుగా సమస్య తీవ్రంగా ఉన్న 12 ప్రాంతాల్లోని గోడలపై ఈ ద్రావకాన్ని స్ప్రే చేయించింది. ఆయా ప్రాంతాల్లో ఇది మూత్రం పోసే గోడ కాదు అంటూ బోర్డులను కూడా ఏర్పాటు చేయించింది. అయితే ఇలాంటి విధానం అములు చేయడం లండన్‌లోనే తొలిసారి కాదు గతంలో జర్మనీలోనూ ప్రయోగత్మకంగా ఏర్పాటు చేసి ఉత్తమ ఫలితాలు సాధించారు. ఆరునెలల్లోపే పూర్తిగా మార్పు వస్తుందని లండన్‌ అధికారులు ఆశిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story