టర్కీలోని ఇస్తాంబుల్​లోని ఓ మార్కెట్​ వద్ద భారీ పేలుడు సంభవించింది..!

* ఈ పేలుడు వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 38 మంది గాయపడ్డారు

R Tripura Malini
Published on: 14 Nov 2022 7:29 AM IST
huge explosion occurred at a market in istanbul, turkey
X

టర్కీలోని ఇస్తాంబుల్​లోని ఓ మార్కెట్​ వద్ద భారీ పేలుడు సంభవించింది

Explosion In Istanbul: టర్కీలోని ఇస్తాంబుల్​లోని ఓ మార్కెట్​ వద్ద భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 38 మంది గాయపడ్డారు. నగరంలోని ప్రముఖ ఇస్తిక్లాల్‌ అవెన్యూ వద్ద ఈ పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు. వెంటనే ఘటనాస్థలికి అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

పేలుడు జరిగిన తర్వాత ప్రాంతంలో ప్రజలు భయంతో పరిగెత్తారు. అక్కడ ఉన్న దుకాణాలను వెంటనే మూసివేశారు. పేలుడు కారణంగా నలుగురు మరణించినట్లు ఇస్తాంబుల్ గవర్నర్‌ అలీ యెర్లికాయ ట్వీట్‌ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇస్తాంబుల్‌లో ఈ మార్కెట్‌ ప్రాంతం పర్యాటకులు , స్థానికులతో ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది

R Tripura Malini

R Tripura Malini

Next Story