Kazakhstan: కజకస్తాన్ లో భారీ పేలుడు.. 9 మంది మృతి

* ఆయుధ డిపోలో పేలుడు

Sandeep Reddy
Published on: 27 Aug 2021 4:18 PM IST
Huge Explosion Near Military Ware House in Kazakhstan
X

కజకస్తాన్ లో భారీ పేలుడు (ట్విట్టర్ ఫోటో)

Kazakhstan: కజకస్తాన్ లో భారీ పేలుడు సంభవించింది. దక్షిణ కజకస్తాన్ మిలటరీ బేస్ లోని ఆయుధ డిపోలో హటాత్తుగా పేలుడు జరిగి 9 మంది మరణించారు. 80 మందికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణం తెలియ రాలేదు. బేజాక్ జిల్లాలోని తరజ్ పట్టణ శివార్లలో ఉన్న మిలటరీ బేస్ లో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు పదార్ధాలను నిల్వవుంచే గొడౌన్ గా ప్రాంతాన్ని వినియోగిస్తున్నారు. అయితే పేలుడు ఎందుకు జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు. పేలుడు జరిగిన వెంటనే ఆప్రాంతానికి దారి తీసే రహదారులను మూసేశారు..ఆ చుట్టుపక్కల ఉన్న 1200మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story