America: అమెరికాలో మరోసారి కాల్పుల మోత

America: ఓక్లహామాలోని ఆసుపత్రి క్యాంపస్‌లో దుండగుడి కాల్పులు

Rama Rao
Published on: 2 Jun 2022 11:22 AM IST
Hospital Attack that Killed Four People in America
X

America: అమెరికాలో మరోసారి కాల్పుల మోత

America: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. టెక్సాస్‌ ఘటనను మరువకముందే అమెరికాలో మరో దారుణం జరిగింది. ఓక్లహామా రాష్ట్రం తుల్సాలోని సెయింట్ ఫ్రాన్సిస్ ఆసుపత్రి క్యాంపస్ భవనంలోకి ప్రవేశించిన ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

మరికొందరు గాయపడ్డారు. కాల్పులు జరిపిన దుండగుడు కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే, అతడిని పోలీసులు మట్టుబెట్టారా? లేక, అతడే తనను తాను కాల్చుకుని మృతి చెందాడా? అన్న విషయంలో స్పష్టత లేదు. కాల్పులు జరిపిన వ్యక్తి సహా మొత్తం నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Rama Rao

Rama Rao

Next Story