Rains in America: అమెరికాలో భారీ వర్షం.. 21 మంది మృతి

* పదుల సంఖ్యలో గల్లంతు *వరదల ధాటికి భారీగా కొట్టుకుపోయిన వాహనాలు *టెన్నెస్సీలో నీటమునిగిన అనేక ప్రాంతాలు

Shireesha
Updated on: 23 Aug 2021 12:30 PM IST
Heavy Rains in Tennessee America
X

టెన్నెస్సీలో నీటమునిగిన అనేక ప్రాంతాలు (ట్విట్టర్ ఫోటో)

Rains in America: అమెరికాలోని టెన్నెస్సీని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో 21 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో వరదల్లో కొట్టుకుపోయారు. టెన్నిస్సీలోని హప్ రేస్ కౌంటీలో ఒకేరోజు 38 సెంటీమీటర్ల వాన కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో వరద తాకిడికి స్థానిక రోడ్లు, బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. సుమారు 21 మంది మరణించారు. డజన్ల కొద్ది మంది గల్లంతయ్యారని దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. టెన్నెస్సీ చరిత్రలో ఇంత భారీ వర‌్షం నమోదవడం ఇదే తొలిసారి. భారీ సంఖ్యలో వాహనాలు కొట్టుకుపోగా, చాలా ప్రాంతాలు నీట మునిగాయి.

Shireesha

Shireesha

Next Story