తూర్పు ఆఫ్రికాలో భారీ వర్షాలు... టాంజానియాలో వరదలతో 155 మంది మృతి
కొండచరియలు విరిగిపడి 226 మందికి గాయాలు
తూర్పు ఆఫ్రికాలో భారీ వర్షాలు... టాంజానియాలో వరదలతో 155 మంది మృతి
తూర్పు ఆఫ్రికాలోని టాంజానియాను భారీ వరదలు ముంచెత్తాయి. ఎల్‌నినో ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది. భారీ వరదల కారణంగా 155 మంది మృతి చెందారు. ఓ వైపు భారీ వరదలు మరో వైపు కొండచరియలు విరిగిపడడంతో 226 మంది గాయాలపాలయ్యారు. భారీ వరదలతో టాంజానియాలోని రోడ్లు, వంతెనలు పూర్తిగా దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా 2 లక్షలకు పైగా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. నివాసాలు పూర్తిగా దెబ్బతినడంతో అక్కడి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మరికొందరు వరదల్లోనే చిక్కుకుని సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Next Story




