Hajj 2024: హజ్ యాత్రలో 600 మందికి పైగా మృతి, వారిలో 98 మంది భారతీయులు... నిప్పులు చెరిగే ఎండకు పిట్టల్లా రాలిపోతున్న జనం

Heatwave kills over 600 people during 2024 Hajj pilgrimage in Saudi Arabia
x

Hajj 2024: హజ్ యాత్రలో 600 మందికి పైగా మృతి, వారిలో 98 మంది భారతీయులు... నిప్పులు చెరిగే ఎండకు పిట్టల్లా రాలిపోతున్న జనం

Highlights

Hajj 2024: జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలని ముస్లింలు భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మక్కాను దర్శించుకొనే హజ్ యాత్రికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.

Hajj 2024: హజ్ యాత్రకు వెళ్లిన వారిలో 900 మందికి పైగా మరణించారు. ఇందులో 68 మంది భారతీయులు కూడా ఉన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ విషయమై భారత ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.


మక్కాలో మండుటెండలకు పోతున్న ప్రాణాలు

ఈనెల 17న మక్కాలో 51.8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మక్కా సందర్శనకు వచ్చిన యాత్రికులు పలువురు మృత్యువాత పడినట్టుగా మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. తీవ్రమైన ఎండలకు యాత్రికులు అస్వస్థతకు గురవుతున్నారని, వారిలో వయసు పైబడిన వారు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మృతి చెందినట్లు అరబ్ దౌత్యవేత్తలు తెలిపినట్లు

జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలని ముస్లింలు భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మక్కాను దర్శించుకొనే హజ్ యాత్రికుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈసారి 18 లక్షల మంది హజ్ ను సందర్శించారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎండ తీవ్రత కారణంగా ఇక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు.

మక్కాలో మరణించినవారిలో 300 మందికిపైగా ఈజిప్ట్ నుండి వచ్చిన యాత్రికులున్నారని అరబ్ దౌత్యవేత్త తెలిపారు. ఇప్పటివరకు మక్కాలో వివిద దేశాలకు చెందిన యాత్రికులు 600 మందికి పైగా మరణించారని ఆ ఏఎఫ్‌పీ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. మృతులలో 68 మంది భారతీయులు ఉన్నారని ఈ కథనంలో తెలిపారు.

ఈజిప్ట్, జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, తునిషియా, ఇరాక్, కుర్ధిస్తాన్ ప్రాంతాల నుండి వచ్చిన వారు చనిపోయారని సౌదీ అధికారులు ప్రకటించారు. ఈనెల 16న సౌదీలో చోటు చేసుకున్న మరణాలతో పాటు 2,700 మంది అస్వస్థతకు గల కారణాలపై సౌదీ ఎలాంటి స్పష్టమైన కారణాలను ప్రకటించలేదు. ఐదు రోజుల పాటు సాగే హజ్ యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సౌదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను ఖర్చు చేసింది. కానీ, ప్రయోజనం లేకపోయింది.

ఆచూకీ దొరకని వారి కోసం గాలింపు

హజ్ యాత్రకు వెళ్లి కన్పించకుండా పోయిన వారి కోసం కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు తమ వారి ఆచూకీ దొరికితే తెలపాలని కోరుతున్నారు. ఈజిప్ట్ కు చెందిన ఓ యాత్రికురాలి ఆచూకీ శనివారం నుండి లభించలేదు. అయితే మృతుల జాబితాలో కూడా ఆమె పేరు లేదు. దీంతో ఆమె బతికే ఉందని ఆమె కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిపితే సమాచారం ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.


మక్కాలో దారుణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

మక్కాలో ప్రతి దశాబ్దానికి 0.4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఓ నివేదిక తెలిపింది. 2019లో ఎంఐటీ నివేదిక మేరకు వాతావరణంలో మార్పుల ప్రభావం ఇక్కడ ఎక్కువగా ఉంటుందని తెలిపింది. 2047 నుండి 2052 వరకు, 2079 నుండి 2086 వరకు తీవ్రమైన ప్రభావాలుంటాయని ఈ నివేదిక వివరించింది.

మక్కాలో యాత్రికుల మరణాలు సాధారణం

హజ్ యాత్రకు వచ్చిన యాత్రికుల్లో పలువురు మరణించడం సర్వసాధారణం. తొక్కిసలాట లేదా ఇతర కారణాలతో ప్రతి ఏటా హజ్ యాత్రికుల మరణాలు చోటు చేసుకుంటాయి. కానీ, ఈసారి మాత్రం ఉష్ణోగ్రతల పెరుగుదలతో యాత్రికులు చనిపోయారు. 2015లో మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 2,400 మంది మృత్యువాతపడ్డారు. 1990లో జరిగిన తొక్కిసలాటలో 1,26 మంది చనిపోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories