Pakistan: పాక్‌లో హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం

Pakistan: శ్రీమారిమాత మందిరంలో దుండగుల దాడి

Rama Rao
Updated on: 9 Jun 2022 5:15 PM IST
Hanuman Idol Destroyed in Mari Mata Mandir in Karachi | Pakistan
X

పాక్‌లో హిందూ దేవతల విగ్రహాల ధ్వంసం

Pakistan: మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే నిత్యం పాకిస్థాన్‌లో హిందువులు, హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోదు. తాజాగా కరాచీలోని కోరాంగి ప్రాంతంలోని శ్రీమారి మాత మందిరంలోని హనుమాన్‌ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. దీంతో స్థానిక హిందువుల్లో తీవ్ర భయాందోళన నెలకొన్నది.

సుమారు 8 మందికి పైగా దుండగులు ఆలయంలోకి ప్రవేశించి దేవతా విగ్రహాలను ధ్వంసం చేసినట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసును కూడా నమోదు చేసుకున్నాయి. ఇటీవల పాకిస్థాన్‌లో హిందూ ఆలయాలపై దాడులు భారీగా పెరిగాయి. ఇండ‌స్ న‌ది స‌మీపంలో ఉన్న ఓ చ‌రిత్రాత్మ‌క ఆల‌యాన్ని కూడా ఇటీవ‌ల ధ్వంసం చేశారు.

Rama Rao

Rama Rao

Next Story