Yahya Sinwar News: ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ సిన్వార్ మృతి?

Yahya Sinwar News: హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 23 Sept 2024 5:07 PM IST
Hamas chief Sinwar killed in Israeli attack?
X

ఇజ్రాయెల్ దాడిలో హమాస్ చీఫ్ సిన్వార్ మృతి?

హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. చాలాకాలంగా అతని కదలికలు లేవు. దీంతో అతను చనిపోయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు.

సిన్వార్ తలదాచుకున్నారనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఇజ్రాయెల్ ఇటీవల కాలంలో హమాస్ సొరంగాలను ధ్వంసం చేసింది. ఈ ఘటనలో ఆయన గాయపడడమో లేదా చనిపోయి ఉంటారనే ప్రచారం తెరమీదికి వచ్చింది.అయితే ఇందుకు స్పష్టమైన ఆధారాలు లేవు.

హమాస్ కమాండర్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఈ ప్రచారాన్ని తెరమీదికి తెచ్చి ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. 11నెలల క్రితం జరిగిన ఉగ్రదాడి నుంచి సిన్వార్ విజయవంతంగా తప్పించుకున్నారు. గతంలో కూడా ఆయన మరణించినట్టుగా తప్పుడు నివేదికలు బయటకు వచ్చాయి. గత డిసెంబర్ లో దక్షిణ గాజాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల సాగుతున్న సమయంలో సిన్వార్ పై జరిగిన వైమానిక దాడిలో ఆయన గాయపడినట్టు లేదా మరణించినట్టు పలు నివేదికలు బయటకు వచ్చాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story