రిషి సునాక్ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న వలసలు

* యూకేకు వచ్చే విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధించే యోచన

R Tripura Malini
Published on: 27 Nov 2022 12:24 PM IST
Growing numbers of immigrants in Britain
X

రిషి సునాక్ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్న వలసలు

United Kindom: బ్రిటన్‌లో రిషి సునాక్ ప్రభుత్వాన్ని వలసలు కలవరపెడుతున్నాయి. దేశంలో వలసదారుల సంఖ్య నానాటికీ పెరగుతుండటంతో దీన్ని నియంత్రించేందుకు కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రధాని సునాక్ భావిస్తున్నారు. ఇందుకోసం విదేశీ విద్యార్థుల సంఖ్యను తగ్గించడంతో పాటు ఇతర మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. వలస వ్యవస్థను పటిష్టం చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని వలసదారుల సంఖ్యను తగ్గించేందుకు ప్రధాని సునాక్ పూర్తిగా కట్టుబడి ఉన్నారని డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగానే యూకేకు వచ్చే విదేశీ విద్యార్థులపై కొన్ని ఆంక్షలు విధించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

R Tripura Malini

R Tripura Malini

Next Story