పెళ్లికి ఏకే 47 గిఫ్ట్‌గా ఇచ్చిన మహిళ

Arun Chilukuri
Updated on: 28 Nov 2020 9:45 PM IST
పెళ్లికి ఏకే 47 గిఫ్ట్‌గా ఇచ్చిన మహిళ
X

సాధారణంగా పెళ్లికి వెళ్తే ఎలాంటి గిఫ్ట్ తీసుకెళ్తారు.. ఏ గోడ గడియారమో, మరీ డబ్బులు ఎక్కువ పెట్టాలి అనుకుంటే జ్యువలరీనో ఇస్తారు. వెరైటీ బహుమతులు కూడా కొందరు ఇస్తారనుకోండి! అలాంటిది ఓ గన్ గిఫ్ట్‌గా ఇస్తే ! అదేంటి అనుకుంటున్నారా అదే జరిగింది మరి ! ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో ఓ మహిళ వరుడికి ఏకే 47 రైఫిల్‌ని బహుమతిగా ఇచ్చింది. ఇదే ఆశ్చర్యం అంటే ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు అక్కడున్న వాళ్ల క్లాప్స్ కొట్టడం మరీ వింతగా అనిపించింది. పాకిస్తాన్‌లో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. గిఫ్ట్ తీసుకుంటే తీసుకున్నావ్ టెస్ట్ చేయాలని అనుకోకు అంటూ నెటిజన్లు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story