భూమ్మీద ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు.. ఎందుకంటే..?

Gravity Does Not Work Near the Hoover Dam of America | Telugu Online News
x

భూమ్మీద ఈ ప్రదేశంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయదు.. ఎందుకంటే..?

Highlights

Hoover Dam: ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అవి తెలిసినప్పడు అందరు ఆశ్చర్యపోతారు...

Hoover Dam: ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉన్నాయి. అవి తెలిసినప్పడు అందరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అవి నమ్మలేని విధంగా ఉంటాయి. అలాంటి కోవకే చెందుతుంది ఈ విషయం కూడా. సాధారణంగా ఈ భూమిపై గురుత్వాకర్షణ శక్తిలేని ప్రదేశాలు ఉండవని అంటారు. కానీ ఒక ప్రదేశంలో గురుత్వాకర్షణ శక్తి పనిచేయడం లేదు. ఆ ప్రదేశం పేరు హూవర్ డ్యామ్ ఆఫ్ అమెరికా. ఇది ఒక ఆనకట్ట. ఇక్కడి నుంచి ఏది విసిరినా అది గాలిలో తేలియాడుతుంది.

ఈ ఆనకట్ట అమెరికాలోని నెవాడా, అరిజోనా రాష్ట్ర సరిహద్దులో నిర్మించారు. వాస్తవానికి హూవర్ డ్యామ్ దగ్గర వస్తువులు గాలిలో ఎగురుతాయి. వాటిపై గురుత్వాకర్షణ ప్రభావం ఉండదు. హూవర్ డ్యామ్ నుంచి ఏదైనా పైకి విసిరితే అది నేలపై పడకుండా గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఈ ఆనకట్ట విల్లు ఆకారంలో నిర్మించారు. పైన పేర్కొన్న విధంగా ఏదైనా వస్తువును ఇక్కడ విసిరినప్పుడు అది డ్యామ్ గోడను తాకి గాలిలో ఎగరడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా ఈ దృశ్యం ఒక అద్భుతం లేదా సైన్స్ ఫిక్షన్ చిత్రంలా అనిపిస్తుంది.

హూవర్ డ్యామ్ ఎత్తు 726 అడుగులు. హూవర్ డ్యామ్ బేస్ మందం 660 అడుగులు. ఇది రెండు ఫుట్‌బాల్ మైదానాలకు సమానం. ఇప్పటి వరకు ఈ ఆనకట్టని నిర్మించి 90 సంవత్సరాలు గడుస్తున్నాయి. అయినా ఇది చెక్కుచెదరలేదు. అమెరికాలో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రాలలో ఇది ఒకటి. దీని నిర్మాణం కోసం వేలాది మంది కార్మికులు పనిచేశారు.

అందులో దాదాపు వంద మంది కార్మికులు నిర్మాణ సమయంలో మరణించారు. ఈ డ్యామ్‌ను అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి. రూజ్‌వెల్ట్ సెప్టెంబర్ 30, 1935న జాతికి అంకితం చేశారు. దీనికి యునైటెడ్ స్టేట్స్ 31వ అధ్యక్షుడు హెర్బర్ట్ హూవర్ పేరు పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories