కుప్పకూలిన గూగుల్‌ సర్వర్లు

Arun Chilukuri
Published on: 14 Dec 2020 5:59 PM IST
కుప్పకూలిన గూగుల్‌ సర్వర్లు
X

గూగుల్‌ సర్వర్లు కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్లు డౌన్ అయ్యాయి. యూట్యూబ్, జీ-మెయిల్, గూగుల్ హోమ్‌, గూగుల్ డ్రైవ్ సహా గూగుల్ సర్వీసులన్నీ కొన్ని నిమిషాలపాటు ఆగిపోయాయి. దాంతో, గూగుల్ ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అంతరాయం ఏర్పడింది. కొన్ని నిమిషాలపాటు గూగుల్ సర్వీసులు ఆగిపోవడంతో నెటిజన్లు గందరగోళానికి గురయ్యారు. ఏమైందంటూ ఆరా తీశారు. అయితే, గూగుల్ సర్వర్లు డౌన్‌పై వేగంగా స్పందించిన సంస్థ సేవల పునరుద్ధరణకు చర్యలు చేపట్టింది. కొన్ని విభాగాల్లో సర్వీసులను పునరుద్ధరించింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో మాత్రమే సేవలు తిరిగి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story