Japan: జపాన్ 100వ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిడా

Japan: జపాన్ 100వ ప్రధానమంత్రిగా పుమియో కిషిడా అధికారికంగా ఎన్నికయ్యారు.

Arun Chilukuri
Published on: 4 Oct 2021 5:11 PM IST
Fumio Kishida Becomes Japans 100th Prime Minister
X

Japan: జపాన్ 100వ ప్రధానమంత్రిగా ఫుమియో కిషిడా

Japan: జపాన్ 100వ ప్రధానమంత్రిగా పుమియో కిషిడా అధికారికంగా ఎన్నికయ్యారు. ఇవాళ జపాన్ పార్లమెంటు ఉభయ సభల్లో మెజారిటీ ఓట్లు సాధించిన మాజీ దౌత్యవేత్త పుమియో ప్రధానమంత్రి అయ్యారు. లిబరల్ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన 61 ఏళ్ల నాయకుడు యోషిహిడే సుగా ఏడాది పాలన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. కిషిడా పార్లమెంటును రద్దు చేసి అక్టోబరు 31న సార్వత్రిక ఎన్నికలు జరిపే అవకాశముందని భావిస్తున్నారు. జపాన్‌లో కరోనా విజయవంతంగా తగ్గుముఖం పట్టాక అత్యవసర పరిస్థితిని ఎత్తివేయడంతో దేశ జనాభాకు కొవిడ్ టీకాలు వేయడంపై తాను దృష్టి పెడతానని ప్రధానమంత్రి కిషిడా చెప్పారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story