Former Taiwan president Dead: తైవాన్‌ మాజీ అధ్యక్షుడు క‌న్నుమూత‌

Former Taiwan president Dead: తైవాన్ ప్రజాస్వామ్య ఉద్యమ పితామహుడు, రాజ‌కీయ వేత్త‌, మాజీ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుయి గురువారం రాత్రి మరణించారు.

Karampoori Rajesh
Published on: 31 July 2020 2:03 PM IST
Former Taiwan president Dead: తైవాన్‌ మాజీ అధ్యక్షుడు క‌న్నుమూత‌
X
former Taiwan president Lee Teng-hui dead,

Former Taiwan president Dead: తైవాన్ ప్రజాస్వామ్య ఉద్యమ పితామహుడు, రాజ‌కీయ వేత్త‌, మాజీ అధ్యక్షుడు లీ టెంగ్‌ హుయి గురువారం రాత్రి మరణించారు. ఆయ‌న గ‌త కొన్నిరోజులుగా హృద్రోగ సంబంధ సమస్యలు, అవయవాలు పని చేయకపోవడంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో ఆయ‌న‌ను గత ఫిబ్రవరి నుంచి తైపే వెటరన్స్‌ జనరల్‌ హాస్పిటల్‌లోనే చేర్చారు. అప్పటి నుంచి ఆయన తైపే‌ హాస్పిటల్‌లోనే ఉన్నారు. చిక్సిత పొందుతూ.. గ‌త రాత్రి 7.24 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు తైపై వెటరన్ జనరల్ ఆస్పత్రి వెల్లడించింది.

తైవాన్‌కు చైనాకు సంబంధం లేకుండా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. తైవాన్‌లో ప్రత్యక్ష ఎన్నికలతోపాటు ఇతర ప్రజాతంత మార్పులు తీసుకువచ్చిన సంస్క‌‌ర్త ఆయ‌న‌. అంతేకాదు.. తైవాన్‌ తమలో అంతర్భాగం అని చైనా భావిస్తుండ‌టంతో దేశానికి స్వాతంత్య్రం కావాలని ఆకాంక్షించారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story