ట్రంప్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై మరోసారి లైంగిక ఆరోపణలు వచ్చాయి. మాజీ మోడల్ అమీ డోరిస్ (48) ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు.1997 లో తనను..

Raj
By Raj
Published on: 18 Sept 2020 9:32 AM IST
ట్రంప్‌పై మరోసారి లైంగిక ఆరోపణలు
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై మరోసారి లైంగిక ఆరోపణలు వచ్చాయి. మాజీ మోడల్ అమీ డోరిస్ (48) ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు.1997 లో తనను బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ట్రంప్‌పై ఈ ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తున్నాయి. న్యూయార్క్‌లో జరిగిన యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో ట్రంప్ విఐపి సూట్‌లో వచ్చి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని.. బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు.. అంతేకాకుండా తన శరీరాన్ని అనుచితంగా తాకారని ఆరోపించారు. ఆ సమయంలో తన వయసు 24 ఏళ్లు.. ట్రంప్ వయసు సుమారు 51 సంవత్సరాలు ఉండొచ్చని ఆమె చెప్పారు.

ఈ విషయంలో న్యాయవాదులు కూడా ట్రంప్ వ్యవహారశైలిపట్ల అసహనం వ్యక్తం చేశారని అమీ డోరిస్ బ్రిటన్ ది గార్డియన్‌తో చెప్పారు. అయితే 2016 లోనే ఈ విషయంపై ప్రజల ముందుకు రావాలని భావించినప్పటికీ, కుటుంబ భద్రత, పిల్లల కోసం మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కాగా ట్రంప్ గత కొంతకాలంగా డజనుకు పైగా లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొన్నారు. 1990 లో ప్రముఖ అమెరికన్ కాలమిస్ట్ ఇ. జీన్ కారోల్ ను డిపార్ట్మెంట్ స్టోర్ గదిలో అత్యాచారం చేశాడనే ఆరోపణలు కూడా వచ్చాయి. మరోవైపు ఈ తాజా ఆరోపణలపై అధ్యక్షుడు ట్రంప్ న్యాయవాదులు వివరణ ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే అమీ డోరిస్ ఆరోపణల చేస్తున్నారని కొట్టి పారేశారు.

Raj

Raj

Next Story