Top
logo

ట్రాన్స్‌జెండర్‌ పై ఐదుగురు అత్యాచారం...

ట్రాన్స్‌జెండర్‌ పై ఐదుగురు అత్యాచారం...
X
Highlights

ఓ ట్రాన్స్‌జెండర్‌ పై అయిదుగురు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పాకిస్తాన్ లో...

ఓ ట్రాన్స్‌జెండర్‌ పై అయిదుగురు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పాకిస్తాన్ లో జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే గత నెల 20 న కామలి నగరానికి చెందినా ఓ నలుగురు ట్రాన్స్‌జెండర్స్ ఓ ఈవెంట్ కోసం ధూప్‌సారి అనే గ్రామానికి వెళ్లారు. అక్కడ అర్ధరాత్రి ఈవెంట్ ముగించుకొని రాగా ఓ అయిదుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. వారితో అసభ్యంగా ప్రవర్తించారు.

అందులో ఓ ట్రాన్స్‌జెండర్‌ని కిడ్నాప్ చేసి ఫామ్‌హౌజ్‌కి తీసుకువెళ్ళి ఆ అయిదుగురు సాముహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరవాత సహివాల్‌ నగరంలో విడిచిపెట్టారు. ఓ స్నేహితురాలు సహాయంతో ఆమె ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత పోలిస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయగా, కానీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీనితో ఆమె డీపీఓకు వెళ్లి చెప్పగా, డీపీఓ చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని నిందుతులను అరెస్ట్ చేసారు.

Next Story